Stock Market: సెన్సెక్స్ కు లాభాలు, నిఫ్టీకి స్వల్ప నష్టాలు

  • ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 94 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 3 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
Markets ends in mixed trend

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మిశ్రమంగా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 67,221కి పెరగ్గా, నిఫ్టీ 3 పాయింట్లు నష్టపోయి 19,993 వద్ద స్థిరపడింది. టెక్, ఐటీ, బ్యాంక్ సూచీలు మినహా మిగిలిన సూచీలు నష్టపోయాయి. కొన్ని రోజులుగా వచ్చిన లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపారు. దీంతో, మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (2.91%), ఎల్ అండ్ టీ (1.68%), ఇన్ఫోసిస్ (1.66%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.49%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.28%).

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.48%), ఎన్టీపీసీ (-3.31%), టాటా మోటార్స్ (-2.19%), టాటా స్టీల్ (-1.68%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.55%).

More Telugu News