చంద్రబాబు, పురందేశ్వరిలపై అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు
- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ముమ్మాటికీ ముద్దాయేనన్న అనిల్
- అక్రమ కేసు నమోదు చేశారని పురందేశ్వరి వ్యాఖ్యానించడం దారుణమని వ్యాఖ్య
- చంద్రబాబును అరెస్ట్ చేసినా ప్రజల్లో స్పందన లేదని ఎద్దేవా
చంద్రబాబును అరెస్ట్ చేసినా ప్రజల్లో ఎలాంటి స్పందన రాలేదని... అందుకే దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ను తీసుకొచ్చి హంగామా చేస్తున్నారని అని విమర్శించారు. ఆదాయపన్ను అక్రమాలు, అమరావతిలో అవినీతి అంశాలు కూడా ఉన్నాయని, అవి కూడా బయటకు వస్తాయని చెప్పారు. అవినీతికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించిన తర్వాతే అధికారులు కేసు నమోదు చేశారని అన్నారు. తప్పు చేసిన వారిపై కేసులు తప్పవని వైసీపీ ప్రభుత్వం నిరూపించిందని చెప్పారు. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.