చంద్రబాబు అరెస్టుపై లండన్ లో ఎన్ఆర్ఐల నిరసన
- ఏపీ సీఎం జగన్ బస చేసిన ప్రాంతంలో ప్లకార్డులతో ఆందోళన
- అరెస్టును ఖండిద్దాం.. ప్రజస్వామ్యాన్ని కాపాడదామంటూ నినాదాలు
- ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లోనూ ఎన్ఆర్ఐ టీడీపీ నిరసన
అక్రమ అరెస్టును ఖండిద్దాం.. ప్రజస్వామ్యాన్ని కాపాడదాం అంటూ నినాదాలు చేస్తూ పలువురు టీడీపీ అభిమానులు ఆందోళన చేశారు. ‘మంచోడు జైల్లో.. పిచ్చోడు లండన్ లో’ ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నెదర్లాండ్స్ తో పాటు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో టీడీపీ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది.