లోకేశ్! మీ నాన్నను జైలుకు పంపించకుండా జైలర్ సినిమాకు పంపిస్తారా?: మంత్రి రోజా
- పిచ్చోడు లండన్‌కు... మంచోడు జైలుకు అంటూ లోకేశ్ ట్వీట్
- చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే అరెస్టయ్యాడని రోజా కౌంటర్
- చంద్రబాబు అరెస్టుతో ఎన్టీఆర్ ఆత్మ సంతోషంగా ఉంటుందని వ్యాఖ్య
- మీ నాన్న నిప్పు అయితే కనుక విచారణ జరుపుకోమని ధైర్యంగా చెప్పాలని సవాల్
సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రోజా కౌంటర్ ఇచ్చారు. 'ఓ పిల్ల సైకో లోకేశ్... మీ డాడీ కేడీ కాబట్టే అరెస్టయ్యాడు' అంటూ విమర్శలు గుప్పించారు. మీ నాన్న మంచోడు కాదని, సూట్ కేసు కంపెనీలతో ముంచేసినోడని తెలుసుకో అన్నారు. ఇలాంటి కరప్షన్ కింగ్‌ను జైలుకు పంపించకుండా జైలర్ సినిమాకు పంపిస్తారా? అని ఎద్దేవా చేశారు. ఓ పప్పూ.. మీ నాన్న తుప్పు కాదు నిప్పు అయితే కనుక ఈ కుంభకోణంలో విచారణ జరుపుకోండని ధైర్యంగా చెప్పు అంటూ లోకేశ్‌కు సవాల్ చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న చంద్రబాబును ఏ దేవుడూ కాపాడలేడని, మీ తాత ఎన్టీఆర్ ఆత్మ ఇప్పటికి సంతోషిస్తుందన్నారు. బైబై తుప్పు.. బైబై పప్పు అంటూ ట్వీట్‌ను ముగించారు.