రాజు కేసీఆర్, యువరాజు కేటీఆర్ బాగానే ఉన్నా.. సామంతరాజు నన్ను టార్గెట్ చేస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్
- మంత్రి పువ్వాడపై రాములు నాయక్ ఫైర్
- దళితబంధుపై తానిచ్చిన జాబితాను పక్కనపెట్టారని ఆగ్రహం
- తనకు టికెట్ రాకుండా చేసినా భరించానన్న ఎమ్మెల్యే
- తానింకా ఎమ్మెల్యేనన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని హితవు
రాజు కేసీఆర్, యువరాజు కేటీఆర్ బాగానే ఉన్నా.. సామంతరాజు తనను టార్గెట్ చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యేగా తనకింకా సమయం ఉందన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. వైరాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.