Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో ఫుట్‌బాల్‌ ఆడిన బండి సంజయ్.. వీడియో ఇదిగో!

Bandi sanjay plays Football with a kid in america
Advertisement
  • 10 రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లిన సంజయ్
  • పలు సమావేశాల్లో పాల్గొంటున్న బీజేపీ నేత
  • ఈ నెల 10న స్వదేశానికి తిరిగి రాక
Advertisement
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ అమెరికా పర్యటనలో ఉన్నారు. పది రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 1వ తేదీన ఆమె అగ్రరాజ్యం వెళ్లారు. అప్పటి నుంచి ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పలు ప్రాంతాల్లో ఆత్మీయ సదస్సుల్లో పాల్గొన్నారు. పలు తెలుగు, తెలంగాణ ప్రవాస సంఘాలతో భేటీ అవుతున్నారు.

 అమెరికా వెళ్లినప్పటి నుంచి బిజీబిజీగా ఉన్న బండి సంజయ్ కాసేపు సేద తీరారు. ఓ చిన్న పిల్లాడితో సరదాగా ఫుట్ బాల్‌ ఆడారు. మైదానంలో తన ఫుట్‌ బాల్‌ నైపుణ్యాలు చూపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను సంజయ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్)లో షేర్ చేశారు. కాగా, ఈ నెల 10న సంజయ్ తన పర్యటనను పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి రానున్నారు. 
Advertisement
Advertisement
Bandi Sanjay
USA
america tour
football

More Telugu News