అనగనగా ఓ కేసీఆర్.. వరి వేస్తే ఉరే అన్నాడు: రేవంత్ రెడ్డి ట్వీట్
- ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత రేవంత్ వ్యంగ్యం
- ఎరువులు ఫ్రీగా ఇస్తానని రైతులను ఎండలో నిలబెట్టాడని విమర్శ
- వరి వేయొద్దని రైతులకు చెప్పి ఆయనే 150 ఎకరాల్లో వేశాడని ఆరోపణ
రేవంత్ రెడ్డి ట్వీట్ యథాతథంగా..
అనగనగా ఒక కేసీఆర్..
వరి వేస్తే ఉరన్నాడు.. ఆయనే 150 ఎకరాల్లో వేశాడు.
24 గంటల కరెంట్ అన్నాడు..
లాగ్ బుక్ చూస్తే పట్టుమని పది గంటలు లేదు.
రైతులకు ఎరువులు ఫ్రీ అన్నాడు..
గంటల తరబడి క్యూల నిలబెట్టాడు.
‘‘కథలు’’ కంచికి- కేసీఆర్ ఫాంహౌస్ కి.