BJP: ఇది కేవలం ఆరంభమే: పేరు మార్పుపై బీజేపీ నేత సీపీ జోషి

BJPs CP Joshi On India Name Change Buzz
షార్ట్స్‌లో చూడండి
ఇండియా పేరును భారత్‌గా మార్చడం ఆరంభమేనని బీజేపీ నేత సీపీ జోషి అన్నారు. పేరు మార్పుపై దేశవ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఆయన మంగళవారం ఎన్డీటీవీతో మాట్లాడుతూ...  'ఇది కేవలం ఆరంభమే' అని వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీ రాజస్థాన్ ఛానల్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఇండియా పేరును భారత్‌గా మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పేరు మార్పును కాంగ్రెస్ సహా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. జీ20 విందుకు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ పంపిన ఆహ్వాన‌ప‌త్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం ఈ ప్రచారానికి కారణమైంది. పేరు మార్పును చాలామంది స్వాగతిస్తుండగా, కొంతమంది విభేదిస్తున్నారు.
Go Back to Shorts
BJP
India
bjarat

More Telugu News