ఐఫోన్ 15 నుంచి కొత్త లెదర్ కేసు
- పర్యావరణ అనుకూల మెటీరియల్స్ తో కొత్త కేసు
- ఇప్పటి వరకు ఉన్న లెదర్ కేసుకు గుడ్ బై
- అచ్చం లెదర్ ను పోలినట్టుగా తయారీ
ప్రస్తుతం ఉన్న లెదర్ కేసును యాపిల్ 2013లో ఐఫోన్ 5ఎస్ తో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు డిజైన్, రంగుల పరంగా పలు మార్పులు చేశారు. పర్యావరణ అనుకూల మెటీరియల్ తో కొత్త కేస్ ను తయారు చేసినట్టు సమాచారం. కాకపోతే ఎలాంటి మెటీరియల్స్ ను తయారీలోకి వినియోగించారన్న వివరాలు లేవు. మరి యాపిల్ తీసుకొచ్చే కొత్త కేస్ ఎలా ఉంటుందో చూడాలంటే పది రోజులు ఆగాల్సిందే. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్ 12న ఆవిష్కరించొచ్చని తెలుస్తోంది.