రక్తపు మడుగులో ఎయిర్ హోస్టెస్.. స్వీపర్ అరెస్ట్
- ముంబైలో రూపాల్ అనే ఎయిర్ హోస్టెస్ మృతి
- 40 ఏళ్ల విక్రమ్ అత్వాల్ ను విచారిస్తున్న పోలీసులు
- కొన్ని రోజుల క్రితం రూపాల్ కు, విక్రమ్ కు మధ్య వాగ్వాదం
దీంతో ముంబైలో ఉన్న ఆమె స్నేహితులకు ఫోన్ చేసి ఫ్లాట్ కు వెళ్లి చూడాలని కోరారు. దీంతో ఆమె స్నేహితులు ఫ్లాట్ వద్దకు వచ్చారు. లోపల నుంచి తాళం పెట్టి ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల వచ్చి తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లి చూడగా రూపాల్ రక్తపు మడుగులో ఉంది. అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ కేసులో 40 ఏళ్ల విక్రమ్ అత్వాల్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే హౌసింగ్ సొసైటీలో అతను స్వీపర్ గా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం రూపాల్ కు, అతనికి వాగ్వాదం జరిగినట్టు సమాచారం.