బాలయ్యను చూస్తే సొంత బాబాయ్లానే అనిపించింది: శ్రీలీల
- బాలయ్యతో ‘భగవంత్ కేసరి’లో నటించిన యువ హీరోయిన్
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా
- ఇటీవల వచ్చిన తొలి పాటకు మంచి స్పందన
‘భగవంత్ కేసరి’ విశేషాలు, బాలయ్యతో తెర పంచుకున్న అనుభవాలను శ్రీలీల తాజాగా వెల్లడిస్తూ, బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ సినిమా చేస్తున్నంతసేపు ఆయన తనకు సొంత బాబాయ్లాగే అనిపించారని చెప్పింది. సెట్ లో బాలయ్య సైతం తనను అలాగే చూసుకున్నారని చెప్పింది. మరో అవకాశం వస్తే మళ్లీ బాలయ్యతో నటించాలని ఉన్నట్టు తెలిపింది. ఇక, సెట్లో సాటి నటులకు బాలకృష్ణ ఇచ్చే గౌరవం చూసి తాను ఫిదా అయిపోయానని చెప్పింది.