పల్లెకెలెలో మళ్లీ వర్షం... ఇన్నింగ్స్ ఆరంభించేందుకు పాక్ ఎదురుచూపులు

Rain delays Pakistan innings
  • ఆసియా కప్ లో టీమిండియా, పాకిస్థాన్ ఢీ
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • రెండుసార్లు ఆటంకం కలిగించిన వరుణుడు
  • 48.5 ఓవర్లలో 266 పరుగులకు భారత్ ఆలౌట్
  • ఇన్నింగ్స్ బ్రేక్ లో మరోసారి వర్షం... చిత్తడిగా మారిన మైదానం
ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలెలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు వరుణుడు పదేపదే అడ్డు తగులుతున్నాడు. తొలుత టీమిండియా బ్యాటింగ్ చేసే సమయంలో రెండుసార్లు ఆటంకం కలిగించిన వర్షం... ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో మళ్లీ ప్రత్యక్షం కావడంతో మైదానం చిత్తడిగా మారింది. దాంతో పాక్ ఇన్నింగ్స్ ఇంకా ప్రారంభం కానే లేదు.

అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. పేస్ కు అనుకూలించిన పిచ్ పై పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్లు చెలరేగిపోయారు. అఫ్రిది 4, నసీమ్ షా 3, హరీస్ రవూఫ్ 3 వికెట్లతో సత్తా చాటారు. 

 టీమిండియాలో హార్దిక్ పాండ్యా (87), ఇషాన్ కిషన్ (82) రాణించడంతో భారత్ కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.
Go Back to Shorts
Rain
Team India
Pakistan
Asia Cup

More Telugu News