నా సహనటుడు నాపై అత్యాచారం చేశాడు: భోజ్ పురి నటి
- సోషల్ మీడియా ద్వారా అతడితో పరిచయం అయిందన్న నటి
- సినిమాల్లోకి రావాలనుందని చెపితే సాయం చేశానన్న బాధితురాలు
- పెళ్లి చేసుకుంటానని చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు
దీంతో, తనకు తెలిసిన వారితో అతడికి అవకాశాలు వచ్చేందుకు సాయం చేశానని, రోజులు గడిచే కొద్దీ అతడిపై తనకు నమ్మకం ఏర్పడిందని తెలిపింది. ఆ తర్వాత తమ మధ్య ప్రేమ మొదలయిందని, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని చెప్పింది. ఒకసారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం తాగి వచ్చి, తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తాను హెచ్చరించానని, దీంతో, ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, ఆ తర్వాత ఆ దిశగా ఏమీ చేయలేదని తెలిపింది. ఇటీవల మరోసారి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.