పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలు.. లోకో పైలట్ గుర్తించడంతో తప్పిన పెను ప్రమాదం
- గుజరాత్‌లోని వడోదరలో ఘటన
- పట్టాలపై స్తంభాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిన ఒక రైలు
- స్తంభాలను గుర్తించి రైలును ఆపేసిన మరో రైలు లోకో పైలట్
పట్టాలపై స్తంభాలను గుర్తించని ఓఖా-షాలీమార్ రైలు వాటిని ఢీకొట్టుకుంటూ వెళ్లినా ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే అదే రూట్లో వెళ్తున్న అహ్మదాబాద్-పూరీ రైలు లోకోపైలట్ పట్టాలపై స్తంభాలను గుర్తించి రైలును నిలపివేయడంతో ప్రమాదం తప్పింది. రైలును ఆపేసిన లోకోపైలట్ వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.