రష్యాలోని పొస్కోవ్ ఎయిర్ పోర్టుపై విరుచుకుపడిన డ్రోన్లు
- గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య ప్రారంభం
- తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్
- అదే సమయంలో రష్యా ఎయిర్ పోర్టులు, కీలక స్థావరాలపై డ్రోన్ దాడులు
- తాజా దాడిలో నాలుగు రవాణా విమానాలకు నష్టం
తాజాగా రష్యాలోని పొస్కోవ్ ఎయిర్ పోర్టుపైనా డ్రోన్లు విరుచుకుపడ్డాయి. మొత్తమ్మీద నాలుగు కార్గో విమానాలను ఈ డ్రోన్లు దెబ్బతీయగలిగాయి. ప్రపంచంలోనే అత్యంత భారీ రవాణా విమానాలుగా పేరుగాంచిన ఇల్యూషిన్-76 విమానాలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు.
కాగా, ఈ దాడిలో పాల్గొన్న డ్రోన్లపై రష్యా సైన్యం ప్రతిదాడులకు దిగింది. డ్రోన్ల దాడిలో ప్రాణనష్టం జరగలేదని, విమానాలు మంటల్లో చిక్కుకున్నాయని అధికారులు తెలిపారు. దాడుల విషయాన్ని స్థానిక గవర్నర్ నిర్ధారించారు.