ఈ సారి పండక్కి 'నా సామిరంగ' .. నాగ్ నుంచి ఫస్టు గ్లింప్స్ రిలీజ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ సారి పండక్కి 'నా సామిరంగ' .. నాగ్ నుంచి ఫస్టు గ్లింప్స్ రిలీజ్!

Na Samiranga First Glimpse Released
  • నాగ్ తాజా చిత్రంగా 'నా సామిరంగ'
  • దర్శకుడిగా ప్రసన్న కుమార్ బెజవాడ పరిచయం 
  • సంగీతాన్ని సమకూర్చుతున్న కీరవాణి 
  • వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల
నాగార్జునకి ఈ మధ్య కాలంలో చెప్పుకోదగిన సినిమా పడలేదు. అందువలన ఆయన కొంత గ్యాప్ తీసుకుని, కొత్తగా అనిపించే కథల కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ వినిపించిన ఒక కథకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా మారుతున్నాడు. 

ఈ ప్రాజెక్టు ఉన్నట్టా .. లేనట్టా అనే ఒక సందేహం ఇండస్ట్రీలో షికారు చేస్తుండగా, నాగార్జున బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాకి 'నా సామిరంగ' అనే టైటిల్ ను ఖరారు చేసి, టైటిల్ పోస్టర్ తో పాటు, నాగ్ ఫస్టులుక్ కి సంబంధించిన పోస్టర్ ను .. ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.  

కాస్త రఫ్ లుక్ తో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో నాగ్ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి, కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. 'ఈ సారి పండక్కి నా సామిరంగ' అంటూ, ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా నాగ్ తోనే చెప్పించారు.

Advertisement
Nagarjuna
Keeravani
Prananna
Na Samiranga

More Telugu News