తెలంగాణ రైతులకు, ప్రజలకు చేదు వార్త.. సెప్టెంబర్ లోనూ వర్షాలు కష్టమేనట!
- అంచనా వేసిన వాతావరణ శాఖ
- 1972 తర్వాత ఆగస్టు నెలలో అత్యల్ప వర్షపాతం నమోదు
- ఎల్‌నినో ప్రభావమే కారణం అంటున్న నిపుణులు
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది రుతుపవనాలు అత్యంత బలహీనంగా మారాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా సెప్టెంబర్‌లోనూ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం లేదని తెలిపింది. వాస్తవానికి ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. దీంతో దేశంలో ఈ ఏడాది జూన్‌లో లోటు వర్షాపాతం ఏర్పడింది. ఆ తర్వాత రుతుపవనాలు చురుగ్గా మారడంతో దేశవ్యాప్తంగా మంచి వర్షాపాతం నమోదైంది. కానీ, తెలంగాణలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది.