వైసీపీ నాయకులు చెప్పిన పిల్లల్నే వలంటీర్లుగా నియమించాం.. వారి ద్వారానే పథకాలు అందుతున్నాయి: మంత్రి ధర్మాన
- అధికారాలు తీసేశారన్న బాధ కార్యకర్తల్లో ఉందన్న మంత్రి
- పార్టీ సిద్ధాంతాలను అర్ధం చేసుకోవాలని సూచన
- ధర్మాన కృష్ణదాసు ప్రమాణస్వీకారంలో మంత్రి వ్యాఖ్యలు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీ నాయకత్వంపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్న మాట నిజమేనని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలన్న ఉద్దేశంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ ప్రవేశపెట్టారని అన్నారు. దీనివల్ల తమ చేతిలో ఉన్న అధికారాలు తీసేశారనే ఆవేదన, బాధ కార్యకర్తల్లో ఉందన్నది వాస్తవమేనని, తాను కాదనని అన్నారు. ఇలా అయితే, ప్రజల్లో పార్టీపై తప్పుడు భావం ఏర్పడే అవకాశం ఉందని, కాబట్టి పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలని మంత్రి సూచించారు.