తిరుమలలో చిక్కిన మరో చిరుత
- అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద బోనులో ఆదివారం రాత్రి చిక్కిన చిరుత
- కొన్ని రోజులుగా అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు ఎట్టకేలకు ఫలితం
- ఇప్పటివరకూ మొత్తం నాలుగు చిరుతలను బంధించామన్న అధికారులు
ఈ చిరుతను బంధించేందుకు అధికారులు కొన్ని రోజులుగా విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత పలుమార్లు బోను వరకూ వచ్చి వెళ్లినట్టు కూడా సీసీటీవీ కెమెరాల్లో కనిపించింది. ఆదివారం రాత్రి ఎట్టకేలకు ఈ చిరుత బోనులో చిక్కింది. ఇప్పటివరకూ మొత్తం నాలుగు చిరుతలు పట్టుబడ్డాయని అధికారులు తెలిపారు.