లైవ్ చాట్ లో హీరో కార్తికేయకు ఊహించని అనుభవం!
- ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించిన కార్తికేయ
- కార్తికేయను దాదాపు బెదిరించిన ఓ యువతి
- ఆందోళన చెందిన కార్తికేయ!
- అమ్మో వద్దు... వద్దు అంటూ విన్నపం
అయితే, టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ కూడా ఇలాగే లైవ్ చాట్ నిర్వహించగా, ఓ యువతి నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. ఆ యువతి దాదాపు బెదిరించినంత పనిచేసింది. అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు కార్తికేయ జవాబు ఇస్తుండగా... ఓ యువతి "రిప్లయ్ ఇవ్వకపోతే చేయి కోసుకుంటా" అంటూ ట్వీట్ చేసింది. ఆమె తీరు గమనించిన కార్తికేయ ఆందోళనకు గురయ్యాడు. "అమ్మో వద్దు... వద్దు" అంటూ వారించాడు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.