అల్లు అర్జున్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు

  • రెండు రోజుల క్రితం 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
  • జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలకు కేసీఆర్ అభినందనలు
  • అల్లు అర్జున్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపిన కేసీఆర్
తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు రావడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు గెలుచుకున్న వారికి అభినందనలు తెలిపారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే పుష్ప, ఆర్ఆర్ఆర్, ఉప్పెన సినిమా బృందాలకు అభినందనలు తెలిపారు. అల్లు అర్జున్‌కు తొలిసారిగా తెలుగు నటుడికి బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.

రెండు రోజుల క్రితం 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. తెలుగు సినిమాలకు మొత్తం పదకొండుకు పైగా అవార్డులు దక్కాయి. ఇందులో ఆర్ఆర్ఆర్ సినిమాకే ఆరు అవార్డులు దక్కాయి.

KCR
Allu Arjun
Tollywood

More Telugu News