Telangana: తొలిసారి సచివాలయానికి వచ్చిన గవర్నర్ తమిళిసై

  • సీఎం కేసీఆర్ తో కలిసి ప్రార్థనా మందిరాలు ప్రారంభించిన గవర్నర్
  • గుడి, మసీదు, చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఇరువురు
  • ఇన్నాళ్లూ ఉప్పు- నిప్పుగా ఉన్న గవర్నర్, సీఎం  
Governor Tamilisai And CM KCR Participated Temple opening In Secretariat

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నూతనంగా నిర్మించిన ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవంలో ఈ రోజు అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇన్నాళ్లు ఉప్పు, నిప్పుగా ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగానే సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ తర్వాత వచ్చిన గవర్నర్ కు సాదర స్వాగతం పలికారు. ఆమెతో కలిసి సీఎం కేసీఆర్ నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చర్చి, మసీదులను కూడా ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తర్వాత గవర్నర్ ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సన్మానించి జ్ణాపికలు అందజేశారు. 

కొత్త సచివాలయం నిర్మించిన తర్వాత ఆ ప్రాంగణంలోకి గవర్నర్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. సచివాలయ ప్రారంభోత్సవం సమయంలో తనకు ఆహ్వానం లభించలేదని గవర్నర్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, నిన్న మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం కోసం రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం కేసీఆర్.. గవర్నర్ తో 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.  ఈ సందర్భంగానే సచివాలయంలో ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవాలకు ఆహ్వానించగా గవర్నర్ హాజరయ్యారు.

More Telugu News