కామారెడ్డిలో కేసీఆర్పై పోటీ వార్తలపై స్పందించిన విజయశాంతి!
- ఈ విషయం పార్టీనే నిర్ణయిస్తుందన్న బీజేపీ సీనియర్ లీడర్
- మీడియాలో వస్తున్న వార్తలకు తన సమాధానం ఇంతేనని ట్వీట్
- కామారెడ్డి, గజ్వేల్ రెండు చోట్ల బీజేపీ గెలుపు తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అని వ్యాఖ్య
‘కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తుంది. రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే. బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం. ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం. ఇది ప్రజలకు తెలియపర్చటం తెలంగాణ ఉద్యమకారుల అందరి బాధ్యత’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.