vaccine: గర్భస్థ శిశువుని కాపాడే టీకా.. అమెరికాలో ఆమోదం

  • ఫైజర్ కంపెనీ అభివృద్ధి
  • 32-36 వారాల గర్భిణులకు ఇచ్చేందుకు అనుమతి
  • తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ
US approves first RSV vaccine during pregnancy to protect infants

గర్భంలోని పిండాన్ని కాపాడే టీకాకు అమెరికాలో ఆమోదం లభించింది. ఫైజర్ కంపెనీ తయారు చేసిన రెస్పిరేటరీ సింకిటైల్ వైరస్ (ఆర్ఎస్ వీ) వ్యాక్సిన్ కు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) అనుమతి మంజూరు చేసింది. మూడు నెలల నుంచి నాలుగు నెలల మధ్య గర్భంతో ఉన్న వారికి ఈ టీకా ఇస్తే.. పిండానికి ప్రాణాంతక శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షణ ఏర్పడుతుంది. 

ఈ టీకాను 32 నుంచి 36 వారాల గర్భంతో ఉన్న వారికి ఇస్తారు. దీంతో తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి ఆరు నెలల వరకు గర్భంలోని శిశువులకు రక్షణ ఏర్పడుతుంది. ఫైజర్ క్లినికల్ పరీక్షల ఫలితాలను విశ్లేషించిన ఎఫ్ డీఏ ప్యానెల్ సంతృప్తి వ్యక్తం చేసి, అనుమతి జారీ చేసింది.

ఆర్ఎస్ వీ అనేది శ్వాసకోశ వ్యవస్థకు సోకే వైరస్. జలుబు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాకపోతే తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలు చేస్తుంది. నిజానికి ఈ వ్యాక్సిన్ ను 60 ఏళ్లకు పైన వయసున్నవారికి ఇచ్చేందుకు లోగడే అనుమతి ఉంది. అబ్రిస్వో బ్రాండ్ పై ఫైజర్ విక్రయిస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ తో ఏటా 60 ఏళ్లకు పైబడిన వారిలో 1,60,000 మంది మరణిస్తున్నారు. ఈ వైరస్ కారణంగా పిల్లల్లోనూ తీవ్ర అనారోగ్యం ఏర్పడుతుంది. ఏటా అమెరికాలో 58,000 - 80,000 వరకు ఐదేళ్లలోపు చిన్నారులు ఈ వైరస్ కారణంగా ఆసుపత్రిలో చేరుతున్నారు.

More Telugu News