‘ఈగల్’ కోసం లండన్ వెళ్లిన రవితేజ

  • చివరి షెడ్యూల్ ను ఫారిన్ లో ప్లాన్ చేసిన దర్శకుడు కార్తీక్
  • టైగర్ నాగేశ్వరరావు టీజర్‌‌తో ఆకట్టుకున్న రవితేజ
  • దసరాకు టైగర్, సంక్రాంతికి ఈగల్ విడుదల!
హిట్, ఫ్లాఫ్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసే హీరోల్లో రవితేజ ముందుంటారు. ఏడాదికి మూడు, నాలుగు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొస్తారాయన. రెండు రోజుల క్రితం ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా టీజర్‌‌ తో ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. దీంతో పాటు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఈగల్’ చిత్రంలోనూ రవితేజ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మిగిలిన షూటింగ్ కోసం రవితేజ లండన్ వెళ్లారు. 

అక్కడ చివరి షెడ్యూల్ ను చిత్రీకరించనున్నారు. ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ దసరా సందర్భంగా అక్టోబర్ 20న విడుదల అవనుంది. ‘ఈగల్’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇక, వచ్చే నెల నుంచి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా చిత్రీకరణకు రవితేజ హాజరుకానున్నారని తెలుస్తోంది.

Raviteja
eagle
movie
Twitter
london

More Telugu News