మూడు రోజులు ఆఫీస్ కు రాకపోతే.. శాశ్వతంగా ఇంటికే: ఉద్యోగులకు మెటా హెచ్చరిక
- సెప్టెంబర్ 5 నుంచి కొత్త నిబంధన అమల్లోకి
- పాటించని వారిపై స్థానిక చట్టాల కింద చర్యలు
- రేటింగ్ తగ్గించడంతోపాటు, అవసరమైతే తొలగిస్తామని హెచ్చరిక
తమ టీమ్ సభ్యులు ఈ సూచనను విధిగా పాటిస్తున్నదీ, లేనిదీ మేనేజర్లు తనిఖీ చేయాలని మెటా కోరింది. ఆదేశాలను పాటించని వారిపై స్థానిక చట్టాల కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెటా ఉద్యోగులకు ఇదే నిబంధన వర్తించనుంది. తరచుగా నిబంధనలను ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని, ఉద్యోగుల పనితీరు రేటింగ్ తగ్గించడంతోపాటు, మరీ తీవ్రమనిపిస్తే తొలగించడం జరుగుతుందని స్పష్టం చేసింది.