రిలీజ్‌కు ముందే రికార్డు కొట్టేసిన బాలయ్య ‘భగవంత్ కేసరి’

Bhagavanth Kesari Worldwide Theatrical Rights sold with record rate of 75CR
నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ డ్రామా చిత్రం ‘భగవంత్ కేసరి’. బాలయ్య సరికొత్త లుక్ కనిపిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తన మార్కు కామెడీకి తోడు యాక్షన్ కూడా జోడించి అనిల్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి విజయాల తర్వాత బాలయ్య ఈ చిత్రంతో హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్లు ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.

దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్‌ కు చాలా సమయం ఉండగానే ఈ సినిమా థియెట్రికల్ రైట్స్‌ అమ్ముడైనట్టు తెలుస్తోంది. బాలకృష్ణ కెరీర్‌‌లోనే అత్యధికంగా రూ. 75 కోట్లకు వరల్డ్ వైడ్ థియెట్రికల్ రైట్స్‌ ను విక్రయించినట్టు టాలీవుడ్‌ సమాచారం. బాలయ్య గత చిత్రం వీరసింహారెడ్డి రైట్స్ అత్యధికంగా రూ.73 కోట్లకు అమ్ముడవగా ఇప్పుడు ఈ రికార్డు బ్రేక్‌ అయింది. కాగా, ఈ చిత్రం అమెరికా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ సంస్థ సరిగమ సినిమాస్ కొనుగోలు చేసింది. అక్టోబర్ 18న యూఎస్‌ లో ప్రీమియర్స్ ప్రదర్శిస్తారు.
Go Back to Shorts
Balakrishna
anil ravipudi
Bhagavanth Kesari
e Theatrical Rights
Tollywood

More Telugu News