Pilots: రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు భారత పైలెట్ల మృతి

  • నిన్న ఖతార్ ఎయిర్ వేస్ విమానంలో ఒక పైలెట్ మరణం
  • అదనపు సిబ్బందిలో ఒకరిగా ప్రయాణికుల క్యాబిన్ లో కూర్చున్న పైలెట్
  • గుండెపోటుకు గురై మృతి
  • ఇవాళ నాగపూర్ లో మరో ఘటన
  • బోర్డింగ్ గేటు వద్ద కుప్పకూలిన ఇండిగో కెప్టెన్
Two Indian pilots dies in two days

నిన్న ఒకరు, ఇవాళ మరొకరు... వరుసగా రెండ్రోజుల్లో ఇద్దరు భారత పైలెట్లు మృతి చెందడం విమానయాన వర్గాల్లో విషాదం నింపింది. 

నిన్న ఖతార్ ఎయిర్ వేస్ కు చెందిన ఢిల్లీ-దోహా విమానంలో పైలెట్ మరణించారు. ఆయన ఈ విమానంలో అదనపు సిబ్బందిలో ఒకరిగా ఉన్నారు. విమానంలో ప్రయాణికుల క్యాబిన్ లో కూర్చుని ఉండగా, గుండెపోటుకు గురయ్యారు. ఆయనను బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 

ఇవాళ, నాగపూర్-పూణే ఇండిగో విమానంలో విధులు నిర్వర్తించాల్సిన ఓ పైలెట్... నాగపూర్ విమానాశ్రయం బోర్డింగ్ గేటు వద్దకు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలారు. ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆ పైలెట్ మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఇండిగో విమానానికి ఆయన కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. 

ఈ ఇద్దరు పైలెట్ల మరణాలను డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నిర్ధారించింది .

More Telugu News