weddings: ఆడంబరంగా పెళ్లి చేసుకుంటే.. విడిపోయే అవకాశం ఎక్కువట: అమెరికా తాజా అధ్యయనంలో వెల్లడి

  • పెళ్ళికి వెయ్యి డాలర్ల లోపు ఖర్చు చేస్తే సేఫ్
  • 20వేల డాలర్లకు మించి ఖర్చు పెడితే ప్రతికూల ఫలితాలు
  • ఖరీదైనా, హనీమూన్ కు వెళితే బలంగా మూడుముళ్లు
Couples who spend more on their weddings are more likely to get divorsed study

పెళ్లంటే జీవితంలో ఎంతో ముఖ్యమైన వేడుక. సామాన్యులు సైతం గొప్పగా తమ వివాహ వేడుక నిర్వహించుకోవాలని ఆశిస్తుంటారు. ఎక్కువ మంది పెళ్లి కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. కొద్ది మంది పొదుపుగా వ్యవహరిస్తుంటారు.  పెళ్లి గురించి అమెరికాలో జరిగిన అధ్యయనం ఫలితాలు వింటే.. భారీగా ఖర్చు చేసి, పెళ్లి పీటలు ఎక్కాలంటే భయపడాల్సి వస్తుందేమో..? 

పెళ్లి విషయంలో పెద్దగా ఖర్చు పెట్టని వారే జీవితాంతం కలిసి ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటున్నట్టు, విడాకుల రేటు తక్కువగా ఉంటున్నట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. అమెరికాకు చెందిన ఎకనమిక్స్ ప్రొఫెసర్లు ఆండ్రూ ఫ్రాన్సిస్, హుగో మియాలన్ 3,000 మందికి పైగా వివాహాలను విశ్లేషించారు. వీరి అధ్యయన నివేదికను సీఎన్ఎన్ వెలుగులోకి తీసుకొచ్చింది. వివాహానికి ఎంత ఎక్కువ ఖర్చు పెడితే, విడాకుల రిస్క్ అంతగా పెరుగుతుందని ఈ పరిశోధకులు తేల్చారు.

2,000 డాలర్ల నుంచి 4,000 డాలర్ల మధ్య నిశ్చితార్థం రోజున వేలి ఉంగరం కోసం ఖర్చు పెట్టిన వారిలో విడాకుల రిస్క్.. 500-2000 డాలర్ల మధ్య ఖర్చు పెట్టి న వారితో పోలిస్తే 1.3 రెట్లు అధికంగా ఉంటున్నట్టు గుర్తించారు. 1,000 డాలర్ల కంటే తక్కువ వ్యయంతో పెళ్లి చేసుకున్న వారిలో విడాకుల అవకాశాలు.. 20,000 డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టే వారితో పోలిస్తే తక్కువ. 20వేల డాలర్లకు మించి ఖర్చు చేసే వారిలో విడాకుల రిస్క్ 1.6 రెట్లు అధికంగా ఉంటుంది. 

హనీమూన్ కు ఖర్చు పెడితే ప్రయోజనం..
హనీమూన్ కు చేసిన ఖర్చు ఫలితాలనిస్తున్నట్టు ఈ పరిశోధకులు గుర్తించారు. వివాహం అనంతరం దంపతులు తమకు నచ్చిన చోటకి వెళ్లి రావడం వల్ల భవిష్యత్తులో విడాకుల రిస్క్ తగ్గుతుందట.

More Telugu News