వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తాగి రాంగ్ రూట్‌లో లారీ నడిపి ఆటోను ఢీకొట్టిన డ్రైవర్.. ఐదుగురి దుర్మరణం
- వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద ప్రమాదం
- ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురి మృతి
- బాధితులను తేనె విక్రయించే కూలీలుగా గుర్తింపు
లారీ డ్రైవర్‌ను రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మద్యం మత్తులో లారీని రాంగ్‌రూట్‌లో నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. బాధితులు తేనె విక్రయించే కూలీలని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.