వరుసగా మూడోసారి గవర్నర్ తేనీటి విందుకు కేసీఆర్ దూరం.. కానరాని కాంగ్రెస్, బీజేపీ కీలక నేతలు
- విందుకు హాజరుకాని బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- విందులో కనిపించని రాజకీయ నేతల హడావుడి
- హాజరైన హైకోర్టు సీజే, పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు
అలాగే, కాంగ్రెస్, బీజేపీకి చెందిన కీలక నేతలు కూడా రాలేదు. దీంతో, తేనీటి విందు కార్యక్రమంలో రాజకీయ నాయకుల హడావుడి కనిపించలేదు. ఈ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు.
మరోవైపు అంతకు ముందే గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. తేనీటి విందుకు కేసీఆర్ కు ఆహ్వానం పంపామని... ఆయన రావడం, రాకపోవడం రాజ్ భవన్ పరిధిలో లేదని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ వైఖరి తనను ఎంతో బాధించిందని అన్నారు. గవర్నర్ల పట్ల సీఎంల వైఖరి ఇలా ఉండటం మంచిది కాదని చెప్పారు.