ఆ ముగ్గురి సారథ్యంలో తెలంగాణ బీజేపీ బస్సు యాత్ర
- సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు బస్సు యాత్రకు బీజేపీ సిద్ధం
- ఉమ్మడి పది జిల్లాలను మూడు క్లస్టర్లుగా విభజించి పాదయాత్ర
- ఒక్కో క్లస్టర్‌కు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్
ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో కీలక నేత నేతృత్వం వహిస్తారు. తెలంగాణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ యాత్రలకు సారథ్యం వహించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు ఈ బస్సుయాత్ర తోడ్పడుతుందని బీజేపీ భావిస్తోంది.