దేవాన్ష్ తో కలసి స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత
- హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో వేడుకలు
- సిబ్బంది అందరికీ మిఠాయిల పంపిణీ
- విజన్ ప్రకారం పనిచేస్తే ప్రపంచశక్తిగా భారత్ అవతరిస్తుందన్న అభిప్రాయం
మరోవైపు 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నేటి మన స్వాతంత్య్ర ఫలం ఎంతో మంది చేసిన త్యాగాల ఫలితమేనన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు, దేశ నిర్మాణంలో అందరూ పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా అవతరిస్తుందని ఆకాంక్షించారు. ఈ విషయంలో ఓ విజన్ ప్రకారం పనిచేయాల్సిన అవసరాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.