Pakistan: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాక్‌కు ఘోర అవమానం

నిన్న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న పాక్‌కు ఘోర అవమానం జరిగింది. తమకు ఎదురైన తలవంపులు తట్టుకోలేక పాకిస్థానీయుల తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మా బతుకులు ఇలా అయిపోయాయంటూ ఓ మహిళ భావోద్వేగానికి లోనైంది. పాక్ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఆ దేశ జాతీయ జెండా దుబాయ్‌లోని అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవంతిపై కనిపించకపోవడమే దీనికి కారణం.  

స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే దేశాల జాతీయ జెండాలను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఈమారు తమ జెండాను చూసుకునేందుకు పాక్ జాతీయులు పెద్ద ఎత్తున బుర్జ్ ఖలీఫా వద్దకు చేరుకున్నారు. అయితే, అర్ధరాత్రి దాటినా కూడా తమ జెండా కనిపించకపోవడంతో వారు తీవ్ర నిరాశ చెందారు. కానీ, భారత జాతీయ జెండా మాత్రం యథాతథంగా ప్రదర్శితమైంది. తీవ్ర నిరాశకు లోనైన పాకిస్థానీయులు దుబాయ్ అదికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మా బతుకులు ఇలా అయిపోయాయంటూ ఓ మహిళ భావోద్వేగానికి లోనయ్యారు.
Pakistan
Burj Khalifa
Independence Day
India

More Telugu News