Anil Kumar Yadav: ఎంత మంది వచ్చినా జగన్ వెంట్రుకను కూడా టచ్ చేయలేరు: అనిల్ కుమార్ యాదవ్

mla anil kumar yadav fires on pawan kalyan
షార్ట్స్‌లో చూడండి
ఎంత మంది కట్టకట్టుకు వచ్చినా జగన్ వెంట్రుకను కూడా టచ్ చేయలేరని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ‘‘యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో సోనియా గాంధీని చూసి దేశం మొత్తం భయపడుతుంటే.. ఆమెనే భయపెట్టిన వ్యక్తి జగన్. జగన్‌ను ఆటాడించే దమ్ము, ధైర్యం ఉన్న మొగోడు ఏపీలో ఇప్పటి వరకు పుట్టలేదు. నవ్వుతూ కామ్‌గా ఉన్నాడులే, ఏమీ చేయలేడులే అనుకుంటున్నారేమో.. దేశంలో చాలా మందిని గడగడలాడించి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్” అని చెప్పారు. 

పవన్ కల్యాణ్ మాట్లాడటం వల్ల శ్రమ దండగ, వారాహికి పెట్రోల్ దండగ అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పవన్ మాట్లాడేవి, చెప్పేవి ఏమీ జరగవని అన్నారు. 2024లో జగన్ ఒక్కరే మీ అందరినీ ఓడించి హైదరాబాద్‌కి పంపించడం ఖాయమని చెప్పారు. 2024లోనూ పవన్ ఓటమి ఖాయమని, ఏపీలో తమ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.  

‘‘పవన్‌కి జై కొడుతూ పిల్ల సైనిక్స్ తమ భవిష్యత్‌ పాడు చేసుకుంటున్నారు. పవన్ ఫ్యూచర్‌కే క్లారిటీ లేదు.. మీకు ఆయన ఏం భరోసా ఇస్తారు. అభిమానం పేరుతో యువకుల జీవితాలను నాశనం చేస్తున్నారు” అని ఆరోపించారు.
Go Back to Shorts
Anil Kumar Yadav
Pawan Kalyan
Jagan
YSRCP
Janasena
Telugudesam

More Telugu News