వాల్తేరు వీరయ్య ఎవరివల్ల ఆడిందో ప్రూవ్ చేయడానికే భోళాశంకర్: ఆర్జీవీ
- భోళాశంకర్ సినిమా విషయంలో దర్శకుడిపై కొంతమంది నెటిజన్ల విమర్శలు
- ఈ క్రమంలో వాల్తేరు వీరయ్యను ప్రస్తావించిన ఆర్జీవీ
- వాల్తేరు వీరయ్య ఎవరివల్ల ఆడిందో చెప్పడానికే భోళాశంకర్ తీశారంటూ చురకలు
ఈ క్రమంలో దర్శకుడు ఆర్జీవీ... చిరంజీవి ఇంతకుముందు సినిమా వాల్తేరు వీరయ్యను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. వాల్తేరు వీరయ్య ఎవరి మూలన ఆడిందో, ప్రూఫ్ చేయడానికి భోళాశంకర్ సినిమా తీసినట్లుగా ఉందని చురకలు అంటించారు. 'వాల్తేరు వీరయ్య ఎవరి మూలాన ఆడిందో , ప్రూవ్ చెయ్యటానికి తీసినట్టుంది బి ఎస్' అని రాసుకొచ్చారు. తద్వారా భోళాశంకర్ సినిమా ఆడలేదనుకుంటే కనుక అందుకు దర్శకుడు కారణమైతే, వాల్తేరు వీరయ్య ఆడిన క్రెడిట్ దర్శకుడిదే అనే అభిప్రాయం వచ్చేలా ట్వీట్ చేశారు.