ఇన్స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు రూ. 11.45 కోట్లు తీసుకుంటున్నాడనే వార్తలపై విరాట్ కోహ్లీ స్పందన
- ఇన్స్టాలో కోహ్లీ సంపాదనపై వైరల్ అవుతున్న వార్త
- ఆ వార్తల్లో నిజం లేదన్న కోహ్లీ
- జీవితంలో తాను అందుకున్న ప్రతి దానికి రుణపడి ఉన్నానని వ్యాఖ్య
మరోవైపు ఇన్స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు ఏకంగా రూ. 11.45 కోట్లు వసూలు చేస్తున్నాడంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ వార్తపై కోహ్లీ స్పందించాడు. ట్విట్టర్ ద్వారా కాసేపటి క్రితం క్లారిటీ ఇచ్చారు. జీవితంలో తాను అందుకున్న ప్రతిదానికీ రుణపడి ఉన్నానని కోహ్లీ చెప్పాడు. సోషల్ మీడియా ద్వారా తన సంపాదన గురించి వస్తున్న వార్తలు నిజం కాదని తెలిపాడు.