రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ప్రహ్లాద్ జోషి
- భారతమాత పదాలను రికార్డ్ల నుండి తొలగించడం అవమానకరమన్న రాహుల్
- తాము తొలగించింది అమర్యాదకరమైన పదాలను మాత్రమేనని జోషి స్పష్టీకరణ
- బారతమాత అనే పదాన్ని కాదని వివరణ
అవిశ్వాస తీర్మానంలో భాగంగా మణిపూర్ అంశంపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలోని పదాలను రికార్డుల నుండి తొలగించడంపై రాహుల్ శుక్రవారం స్పందించారు. తాను ఆధారాలు లేకుండా మాట్లాడలేదని, మణిపూర్ పరిస్థితులు అలాగే ఉన్నాయని, ఇరువర్గాల మధ్య చర్చలు లేవన్నారు. కేవలం హింస మాత్రమే చెలరేగుతోందన్నారు.