ఎవరికో ఫిర్యాదు చేస్తే భయపడే ప్రభుత్వం కాదిది: పవన్ కల్యాణ్ కు మంత్రి అమర్నాథ్ కౌంటర్
- కేంద్రంలో అంత పలుకుబడే ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని సవాల్
- వైజాగ్ పర్యటనలో స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదేమని ప్రశ్న
- బైడెన్ కు, పుతిన్ కు చెప్పుకున్నా భయపడేవారు ఎవరూ లేరని ఎద్దేవా
వైజాగ్ లో పర్యటించిన పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదేమని మంత్రి నిలదీశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ వైఖరేంటని ప్రశ్నించారు. ఈమేరకు విశాఖ సర్క్యూ ట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. సీఎం జగన్ పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను మంత్రి తప్పుబట్టారు.