ప్రధాని గారూ వింటున్నారా?.. పార్లమెంటులో నిప్పులు చెరిగిన తృణమూల్ ఎంపీ మహువా
- ఇండియాపై విశ్వాసం ప్రదర్శించేందుకే అవిశ్వాసం పెట్టామన్న టీఎంసీ ఎంపీ
- ఆరడుగుల లోతున పాతిపెట్టిన సిద్ధాంతాలను వెలికి తీసేందుకే అవిశ్వాసం పెట్టామని స్పష్టీకరణ
- సభ్యుల మాటలు వినేందుకు రాని మోదీ.. తన మాటలు వినిపించేందుకు వచ్చారని ఎద్దేవా
- 37 శాతం ఓట్లున్న పార్టీ బెదిరిస్తుంటే భయపడబోమన్న మహువా మెయిత్రా
పార్లమెంటులో తరచూ నోరుమూసుకోమని చెప్పే ప్రధాని నరేంద్రమోదీ ఇప్పుడు మణిపూర్ గవర్నర్‌ను కూడా ఇలాగే ఆదేశించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల మాటలు వినేందుకు మంగళ, బుధవారాల్లో సభకు రాని మోదీ.. గురువారం మాత్రం తన మాటలను సభ్యులకు వినిపించేందుకు వచ్చారని ఎద్దేవా చేశారు. ‘‘ప్రధాని గారూ.. మీరు వింటున్నారా? మణిపూర్ పాలనా వ్యవస్థను మార్చండి. పార్టీలు కలిసి పనిచేయడానికి అవకాశం ఇవ్వండి" అని మహువా కోరారు. ప్రధానిపై దేశం విశ్వాసం కోల్పోయిందన్న ఎంపీ.. 37 శాతం ఓట్లున్న పార్టీ అధికారంలోకి వచ్చి బెదిరిస్తుంటే మిగిలిన 63 శాతం ఓట్లున్న పార్టీలు భయపడబోవని తేల్చి చెప్పారు.