శివలింగం తొలగించాలని తీర్పు.. అసిస్టెంట్ రిజిస్ట్రార్ అకస్మాత్తుగా మూర్ఛపోవడంతో తీర్పు వెనక్కు తీసుకున్న జడ్జి!
- కలకత్తా హైకోర్టులో భూవివాదం కేసులో అనూహ్య పరిణామాలు
- వివాదాస్పద స్థలంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన శివలింగం
- దాన్ని తొలగించాలంటూ న్యాయమూర్తి తీర్పు
- తీర్పు నమోదు చేసుకుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు అకస్మాత్తుగా మూర్ఛ
- వెంటనే తీర్పును ఉపసంహరించుకున్న న్యాయమూర్తి
- దిగువ కోర్టులో తేల్చుకోవాలంటూ పిటిషనర్లకు సూచన
విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ గుప్తా ఇరు వర్గాల వాదనలూ విన్నారు. అనంతరం, శివలింగం తొలగించాలంటూ తీర్పు వెలువరించారు. అయితే, జడ్జిమెంట్‌ను నమోదు చేసుకుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ అకస్మాత్తుగా మూర్ఛపోవడంతో కలకలం రేగింది. ఈ క్రమంలోనే న్యాయమూర్తి తన తీర్పును ఉపసంహరించుకున్నారు. అంతేకాకుండా, ఈ వివాదంపై హైకోర్టు కలుగజేసుకోదని, కింది కోర్టులో తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించారు.