మహేశ్ బాబు బర్త్ డే గిఫ్ట్.. గుంటూరు కారం నుంచి ఊర మాస్ లుక్ పోస్టర్
- త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న మహేశ్
- ఈ రోజు మహేశ్ బాబు పుట్టిన రోజు
- లుంగీ కట్టుకొని బీడీ కాలుస్తున్న ఫొటో విడుదల
ఇక ఈ రోజు సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులను ఖుషీ చేసే అప్డేట్ చిత్ర బృందం నుంచి వచ్చింది. ఈ సినిమాలోని మహేశ్ బాబు మాస్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. లుంగీ కట్టుకొని, ఫుల్ హ్యాండ్ చొక్కా వేసుకొని, కళ్లజోడు పెట్టుకొని బీడీ వెలిగించుకుంటున్న మహేశ్ ఫోటో అభిమానులను అలరిస్తోంది. సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెల మూడో వారంలో మొదలవనుంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
.