Mahesh Babu: మహేశ్​ బాబు బర్త్ డే గిఫ్ట్​.. గుంటూరు కారం నుంచి ఊర మాస్ లుక్‌ పోస్టర్

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న మహేశ్
  • ఈ రోజు మహేశ్ బాబు పుట్టిన రోజు
  • లుంగీ కట్టుకొని బీడీ కాలుస్తున్న ఫొటో విడుదల
Mahesh babu new mass poster from Guntur Karam

మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'గుంటూరు కారం'.  చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి ఈ సినిమా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ప్రాజెక్టు ఆగిపోయిందని, కథలో మార్పులు చేశారంటూ వార్తలు వచ్చాయి. మరోపక్క పలువురు బడా స్టార్లు, టెక్నీషియన్లు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అయినప్పటికీ అనుకున్న టైమ్‌కు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. 

ఇక ఈ రోజు సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులను ఖుషీ చేసే అప్‌డేట్ చిత్ర బృందం నుంచి వచ్చింది. ఈ సినిమాలోని మహేశ్ బాబు మాస్ లుక్ పోస్టర్‌‌ ను రిలీజ్‌ చేసింది. లుంగీ కట్టుకొని, ఫుల్ హ్యాండ్ చొక్కా వేసుకొని, కళ్లజోడు పెట్టుకొని బీడీ వెలిగించుకుంటున్న మహేశ్ ఫోటో అభిమానులను అలరిస్తోంది. సినిమా తదుపరి షెడ్యూల్‌ ఈ నెల మూడో వారంలో మొదలవనుంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
.

More Telugu News