CPI Ramakrishna: 2025 వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారా?: సీపీఐ రామకృష్ణ

Will Jagan be CM until 2025 asks CPI Ramakrishna
షార్ట్స్‌లో చూడండి
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 10 లక్షల చొప్పున ఇస్తానంటూ గతంలో చెప్పిన ముఖ్యమంత్రి జగన్... ఇప్పుడు పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటూ మోసం చేస్తున్నారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. సీఎం అయినప్పటి నుంచి ఒక్కో ఏడాది గడువు పెంచుకుంటూ వచ్చిన జగన్... ఇప్పుడు 2025కి పోలవరం పూర్తవుతుందని చెపుతున్నారని దుయ్యబట్టారు. 2025 వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారా? అని ఎద్దేవా చేశారు. జగన్ సీఎంగా ఉన్నంత కాలం పోలవరం పూర్తి కాదని చెప్పారు. పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నాన్ని వైఎస్సార్, చంద్రబాబు చేయలేదని... ఎత్తు తగ్గించే పని జగన్ చేస్తున్నారని విమర్శించారు. అమరావతిని ధ్వంసం చేసినట్టే పోలవరంను కూడా చేస్తున్నారని అన్నారు. ఈ నెల 23న పోలవరంపై ఏలూరులో నిరసన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు.
Go Back to Shorts
CPI Ramakrishna
Jagan
YSRCP
Polavaram Project

More Telugu News