గద్దర్ పార్థివదేహానికి కేసీఆర్ నివాళులు.. గద్దర్ భార్యకు సోనియా గాంధీ సంతాప లేఖ
- అల్వాల్లో గద్దర్ పార్థివదేహానికి నివాళులర్పించిన కేసీఆర్
- కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి
- వెంట మహమూద్ అలీ, తలసాని, హరీశ్ రావు
మరోపక్క, గద్దర్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ సంతాపం తెలిపారు. ఈ మేరకు గద్దర్ భార్య విమలారావుకు లేఖ పంపించారు. అలాగే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తూ 'అశేష జనదారులు.. అనేక అశృధారలు.. గద్దరన్న సంపాదించుకున్న ఆస్తి. ధన్యజీవి… నిన్ను మరువదు ఈ గడ్డ' అంటూ ట్వీట్ చేశారు.