అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. అవమానం భరించలేక ఆత్మహత్య
- అసోంలోని కామరూప్ జిల్లాలో ఘటన
- నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు ఉరేసుకున్న బాధిత అమ్మాయిలు
- పోస్టుమార్టం నివేదిక వచ్చాకే అసలు విషయం తెలుస్తుందన్న పోలీసులు
తీవ్ర మనస్తాపానికి గురైన వారిద్దరూ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నారు. చెట్టుకు వేలాడుతున్న వారి మృతదేహాలను చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. వారిపై అత్యాచారం జరిగిందని, అవమానం భరించలేకే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు ఏమీ మాట్లాడలేమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.