తల్లి అయిన ఇలియానా!
- ఆగస్టు 1న బిడ్డకు జన్మనిచ్చినట్టు పేర్కొన్న ఇలియానా
- కుమారుడి పేరు కోవా ఫీనిక్స్ డోలన్ అని వెల్లడి
- తమ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమని వ్యాఖ్య
- సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న శుభాకాంక్షల సందేశాలు
ఇలియానా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించారు. ఆ తరువాత జులైలో తన ప్రియుడి ఫొటోలను కూడా షేర్ చేశారు. ‘దేవదాస్’ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఇలియానా ఆ తరువాత పలు హిట్ చిత్రాల్లో నటించి టాప్ స్థానానికి చేరుకున్నారు. ఆపై బాలీవుడ్‌లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు.