'బలగం' సినిమా చూసి నా ఫ్యామిలీ ఆ ప్రశ్న వేసింది: అసెంబ్లీలో కేటీఆర్
- వేణు ఎల్దండి తీసిన బలగం సినిమా చాలా బాగుందని కితాబు
- ఈ సినిమాలో బంధాలను చూపిన తీరు అందర్నీ కన్నీరు పెట్టించిందన్న మంత్రి
- సినిమా తీసిన కోనారావుపేట కోనసీమలా కనిపించిందన్న కేటీఆర్
తానూ కుటుంబ సభ్యులతో పాటు ఈ సినిమాను చూశానని, ఈ సినిమాలో గ్రామంలో పల్లె ప్రకృతి కనిపించిందని కేటీఆర్ అన్నారు. సినిమాను చూసిన తన కుటుంబ సభ్యులు బలగంలో ఉన్న ఊరు కోనారావుపేటనా? కోనసీమనా? అని అడిగారని చెప్పారు.
కేసీఆర్ తెలంగాణ గ్రామాలను ఈ స్థాయిలో అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణ గ్రామాలు కోనసీమలా మారాయన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తెలంగాణలోని వివిధ గ్రామాలకు చెందిన ఫోటోలను అసెంబ్లీలో ప్రదర్శించారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, డంప్ యార్డ్, మిషన్ కాకతీయ చెరువు, మిషన్ భగీరథ ట్యాంకులు, వైకుంఠధామం కనిపిస్తాయన్నారు. ఏ గ్రామం ఫోటో తీసినా ఇవన్నీ కనిపిస్తాయన్నారు.