సూపర్‌‌స్టారా మజాకా.. సినిమా బడ్జెట్‌ 225 కోట్లు.. రజనీకాంత్ పారితోషికం 110 కోట్లు!

Rajinikanth Has Taken Away Home A Massive 110cr for Jailer remuneration
  • ఈ నెల 10న విడుదల కానున్న చిత్రం
  • నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం
  • హీరోయిన్‌గా నటించిన తమన్నా
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్‌‌’ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 10న విడుదలవనుంది. రజనీకాంత్‌  సరన తమన్నా హీరోయిన్ గా నటించగా.. మోహన్‌ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నెల్సన్ దిలీప్‌ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 225 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. సినిమా పోస్టర్లు, పాటలు, ట్రైలర్‌‌కు మంచి స్పందన వచ్చింది. ప్రీ బిజినెస్ కూడా ఆ స్థాయిలోనే జరిగింది. 

ఈ సినిమాలో నటీనటుల పారితోషికం విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో నటించినందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఏకంగా 110 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంటే సినిమా బడ్జెట్‌లో దాదాపు సగం ఆయన పారితోషికమే అవుతోంది. గతంలోనూ ఓ సినిమాను రజనీ ఇంతే మొత్తం తీసుకున్నారట. మోహన్‌ లాల్ కు 8 కోట్లు, శివరాజ్ కుమార్,  జాకీ ష్రాఫ్ కు చెరో నాలుగు కోట్లు, తమన్నాకు మూడు కోట్లు, యోగి బాబుకు కోటి, రమ్యకృష్ణకు 80 లక్షలు ముట్టచెప్పినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Rajinikanth
Jailer
movie
110cr
remuneration

More Telugu News