మా పిల్లి తప్పిపోయింది... ఎక్కడైనా కనిపించిందా?... మంచిర్యాలలో పోస్టర్లు

Cat Missing posters in Manchiryal
  • నాలుగేళ్లుగా పిల్లిని పెంచుకుంటోన్న పర్వేజ్ కుటుంబం
  • ఉన్నట్టుండి కనిపించకుండా పోయిన పిల్లి
  • నాలుగు నెలలుగా తీవ్రంగా వెదుకుతున్న పర్వేజ్ కుటుంబం
  • పిల్లి ఆచూకీ చెబితే రూ.10 వేల రివార్డు ఇస్తామంటూ పోస్టర్లు
తెలంగాణలోని మంచిర్యాల పట్టణంలో ఇప్పుడో పిల్లికి సంబంధించిన పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తమ పెంపుడు పిల్లి తప్పిపోయిందంటూ ఓ కుటుంబం ఆ పోస్టర్లు వేసింది. మంచిర్యాల పట్టణానికి చెందిన పర్వేజ్ కుటుంబం ఓ పిల్లిని పెంచుకుంటోంది. గత నాలుగేళ్లుగా ఆ పిల్లి పర్వేజ్ కుటుంబంలో భాగమైపోయింది. ఆ పిల్లి పేరు ఫ్లుష్పీ. ఉన్నట్టుండి ఆ పిల్లి మాయమైంది. గత 4 నెలలుగా ఆ పిల్లి కోసం పర్వేజ్ కుటుంబం వెతకని చోటంటూ లేదు. దాంతో, తమ పిల్లిని వెతికి తెచ్చిన వారికి రూ.10 వేలు ఇస్తామంటూ వారు పోస్టర్లు కూడా ముద్రించి, పట్టణంలోని పలు ప్రాంతాల్లో అతికించారు.
Go Back to Shorts
Cat
Missing
Manchiryal
Reward

More Telugu News